Grief
ఇపుడొస్తనంటివి
ఇంక రాకపోతివి
కండ్లల్ల ఉంటివి
కానరాకుంటివి
ఊపిరులనుంటివి
ఊపిరాడనంటివి
గుండెలను తడిమితివి
గుండెలన్నీ పిండితివి
వెలుగులను నింపితివి
చీకట్లని మిగిలిస్తివి
ఒంటరుల జేసితివి
మమ్ము వీడిపోతివి
అన్న, సుభాసన్న, బోసన్న, భోరుమన్న
నువ్వు రాకపోతివి, అన్యాయం చేస్తివి
Comments
Post a Comment