Posts

Showing posts from March, 2022

Grief

   ఇపుడొస్తనంటివి  ఇంక రాకపోతివి  కండ్లల్ల ఉంటివి  కానరాకుంటివి  ఊపిరులనుంటివి  ఊపిరాడనంటివి  గుండెలను తడిమితివి  గుండెలన్నీ పిండితివి  వెలుగులను నింపితివి  చీకట్లని మిగిలిస్తివి  ఒంటరుల జేసితివి  మమ్ము వీడిపోతివి  అన్న, సుభాసన్న, బోసన్న, భోరుమన్న  నువ్వు రాకపోతివి, అన్యాయం చేస్తివి